సూర్యాపేట : నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావుకు నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయడానికి ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. నేరేడుచర్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలను ఆయన రద్దు చేశారు. మొత్తం 15 వార్డులున్న నేరేడుచర్లలో టీఆర్‌ఎస్ 7, కాంగ్రెస్ 7, సీపీఎం 1 స్థానంలో విజయం సాధించాయి. కాంగ్రెస్, సీపీఎం కూటమిగా ఉన్నాయి. అయితే, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 19 మంది చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారని రిటర్నింగ్ అధికారి జాబితాలో పేర్కొన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కేవీపీ రామచందర్‌రావు ఓటు పెట్టుకున్నా జాబితాలో లేకుండా పోయింది.
తీవ్ర గందరగోళం.. చైర్మన్ ఎన్నిక వాయిదా..!